UC News

Amazon Great Indian సేల్‌లో తాజాగా ఈ ఫోన్ల మీద ఎక్చేంజ్ ఆఫర్లు!

Amazon Great Indian సేల్‌లో తాజాగా ఈ ఫోన్ల మీద ఎక్చేంజ్ ఆఫర్లు!

Amazon Great Indian Saleలో మొబైల్ ఫోన్ల మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది అని కొన్నాళ్ళ క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. అప్పట్లో కొన్ని మోడల్స్ గురించి కూడా మన "కంప్యూటర్ ఎరా"లో ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరి కొన్ని మోడల్స్ కు సంబంధించిన ఎక్చేంజ్ ఆఫర్ల సమాచారం వెలుగులోకి వచ్చింది.

జనవరి 19 నుండి జనవరి 22 మధ్య ఈ Amazon Great Indian Sale నిర్వహించబడుతుంది. స్మార్ట్ ఫోన్స్ విషయానికొస్తే OnePlus 7T ఫోన్లని నెలకు 1648 రూపాయలకు ఈఎమ్ఐ కింద కొనుగోలు చేయవచ్చు. అలాగే ఫోన్ ఎక్స్చేంజ్ మీద 7,700 వరకు తగ్గించబడుతుంది. Galaxy M30s ఫోన్ విషయానికి వస్తే, 16,999 రూపాయల ఇది లభిస్తుంది.

6GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ ఇది. నెలకు 800 రూపాయలు చొప్పున ఈఎంఐ చెల్లించి ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Redmi Note 8 Pro విషయానికొస్తే, ఎక్స్చేంజ్ కింద 7700 వరకు తగ్గించబడుతుంది. 11 శాతం డిస్కౌంట్ తో ఇది కేవలం 15999 రూపాయలకు లభిస్తుంది. నెలకు 753 రూపాయలు EMI చొప్పున చెల్లించి ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. Vivo U20కి 7,700 ఎక్స్ చేంజ్ ఆఫర్ లభించడంతోపాటు, నెలకి 564 రూపాయలు చెల్లించి దీన్ని EMI కింద కొనుగోలు చేయవచ్చు. OnePlus 7T Pro 53,999 రూపాయలకు లభించడంతోపాటు, రెండు వేల రూపాయల క్యాష్ బ్యాక్ అందించబడుతుంది. అలాగే ఎక్స్చేంజ్ కింద అదనంగా రెండు వేల రూపాయలు ధర తగ్గుతుంది.

Redmi Note 8 ఫోన్‌ని నెలకి 471 రూపాయలు EMI చెల్లించి కొనుగోలు చేయవచ్చు. దాంతోపాటు 7700 రూపాయలు ఎక్స్చేంజ్ కింద లభిస్తుంది.Samsung Galaxy M30 నెలకి 565 రూపాయల EMIతో కొనుగోలు చేయొచ్చు. Poco F1 ఫోన్ మీద పది వేల రూపాయల వరకు డిస్కౌంట్‌తో కేవలం 14,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. దాంతోపాటు 7700 రూపాయలు ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద లభిస్తుంది.

Nokia 6.2 ఫోన్ విషయానికొస్తే 24 శాతం డిస్కౌంట్ తో ఇది కేవలం 13399 రూపాయలకు లభిస్తుంది. దాంతోపాటు 7700 ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. Huawei P30 Lite ఫోన్ కేవలం 15,990కి కొనుగోలు చేయొచ్చు. Apple iPhone 11 Proని నెలకు 4703 రూపాయలు EMI చెల్లించి సొంతం చేసుకోవచ్చు. దాంతోపాటు 7,750 రూపాయల ఎక్స్చేంజి ఆఫర్ అందించబడుతుంది. Honor 8 ఫోన్‌ని 36 శాతం డిస్కౌంట్ కింద 22,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

Topic: #amazon #oneplus
READ SOURCE
Open UCNews to Read More Articles